Arrest Without Warrant – వారెంట్ లేకుండా పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చెయ్యవచ్చు!
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ప్రకారం పోలీసులు ఎటువంటి సందర్భాలలో వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చో తెలుసుకుందాం.
ఎప్పుడైతే ఒక వ్యక్తి పోలీసుల ఎదుట Cognizable Offence చేస్తాడో, అటువంటి సందర్భాలలో పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు
(లేదా) ఎవరైనా complaint చేసినప్పుడు లేదా ఫలానా వ్యక్తి Cognizable Offence చేసి ఉంటాడు అని నమ్మదగిన Information ఉన్నా లేదా నమ్మదగిన అనుమానం ఉన్నా పోలీసులు అరెస్ట్ చెయ్యవచ్చు.
చేసిన నేరానికి 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే నేరం చేసినా లేదా 7 సంవత్సరాలు కన్నా ఎక్కువ శిక్ష పడే నేరం చేసినా లేదా శిక్ష తో పాటు ఫైన్ ఉన్నా, శిక్షతో పాటు ఫైన్ లేకున్నా, దిగువ తెలిపిన conditions ఉంటె అరెస్ట్ చెయ్యవచ్చు.
Conditions గురించి తెలుసుకునే ముందు Cognizable Offence అంటే ఏమిటి?
వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే Offence చేసినప్పుడు అంటే రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం శిక్ష పడే నేరం చేసినప్పుడు, అటువంటి నేరాన్ని Cognizable Offence అంటారు.
ఉదాహరణకి :
ఒక వ్యక్తి ఎవరినైనా Rape చేసినప్పుడు 7 సంవత్సారాలు కన్నా ఎక్కువ శిక్ష పడుతుంది.
POCSO కేసు అంటే 18 సంవత్సారాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల పట్ల సెక్సువల్ activity చేస్తే, వీటిని Cognizable Offence అంటారు. ఇటువంటి నేరాలు చేసినప్పుడు పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు.
Conditions గురించి తెలుసుకుందాం.
- పోలీస్ ఆఫీసర్ కి వచ్చిన complaint లేదా నమ్మదగిన information లేదా అనుమానం ఉన్నా, నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చెయ్యవచ్చు.
- ఒకవేళ అరెస్ట్ తప్పని సరిగా చెయ్యాలి అన్నప్పుడు, మరొక నేరం చేయకుండా ఆపెదానికి అరెస్ట్ చెయ్యవచ్చు.
- నేరానికి సంభంధించిన ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి అరెస్ట్ చెయ్యవచ్చు.
- నేరం చేసిన నేరస్తుడు, సాక్షాలను తారుమారు చేయకుండా లేదా ఆధారాలు దాచేయకూడదు అన్నప్పుడు అరెస్ట్ చెయ్యవచ్చు.
- నేరం చేసిన నేరస్తుడు, సాక్షులను బెదిరించవచ్చు లేదా ప్రలోభాలకు గురిచేయవచ్చు లేదా సాక్షులను బెదిరించవచ్చు. ఇలా సాక్షులను బెదిరించినప్పుడు వారు కోర్ట్ లో లేదా పోలిసుల ముందు నిజాలు చెప్పరు.
- అవసరం అయినప్పుడు కోర్ట్ లో సంభందిత ముద్దాయిని కోర్ట్ లో ఉంచడానికి నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు.
- పోలీసు ఏ కారణంతో అరెస్ట్ చేస్తాడో దానిని రాత రూపంలో రాసి ఉంచాలి.
- అలాగే అరెస్ట్ చెయ్యకపోతే లేదా అరెస్ట్ అవసరం లేకపోతే దానికి సంభందించిన కారణం కుడా రాత పూర్వకంగా రాసి ఉంచాలి.
ఫలానా వ్యక్తి Cognizable Offence చేసాడని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, అటువంటి నేరానికి ఏడు సంవత్సరాలకన్నా ఎక్కువ శిక్ష పడుతుంది, శిక్షతో పాటు జరిమానా పడవచ్చు లేదా పడకపోవచ్చు లేదా నేరానికి మరణశిక్ష కుడా పడవచ్చు అనే నమ్మకం పోలీస్ ఆఫీసర్ కి ఉన్నప్పుడు, నేరం మోపబడిన వ్యక్తిని అరెస్ట్ చెయ్యవచ్చు.
Proclaimed Offenders అని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత లేదా ఒక ఆర్డర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్ధారించబడిన వారిని అరెస్ట్ చెయ్యవచ్చు.
ఒకరి దగ్గర నేరం చేయడానికి ఉపయోగించిన వస్తువులు దొరికినా లేదా ఒకరి దగ్గర దొంగలించిన వస్తువులు దొరికినా, అటువంటి సందర్భాలలో పోలీసులు warrant లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు
Lawful కస్టడీ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినా, పోలీస్ ఆఫీసర్ తన విధులను నిర్వహించేటప్పుడు obstruct చేసినా, పోలీసుల నుండి తప్పించుకుని తిరిగే వారిని అరెస్ట్ చెయ్యవచ్చు