How To Link Mobile Number to Voter ID
మీ voter ID కార్డు కి మీ మొబైల్ నెంబర్ ను ఎలా లింక్ చెయ్యచ్చో తెలుసుకుందాం
మీ ఇంట్లో కూర్చొని కంప్యూటర్ లేదా మీ మొబైల్ ఉపయోగిస్తూ voter ID కార్డు కి మొబైల్ నెంబర్ ను లింక్ చేసి మరియు Voter ID కార్డు ను ఎలా download చేసుకోవచ్చో తెలుసుకుందాం.
మీరు మీ మొబైల్ లో ఈ ప్రక్రియ చేస్తున్నట్టు అయితే గూగుల్ chrome ఓపెన్ చేయండి. పైన కుడి వైపున మూడు చుక్కలు వుంటాయి. వాటి మీద tap చెయ్యండి. ఈ సెట్టింగ్స్ లో Desktop Site ని సెలెక్ట్ చేయ్యండ్. లేదంటే ఈ క్రిందన ఉన్న ఇమేజ్ ని చూడండి.
నేను ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియను మీరు మొబైల్ లో లేదా కంప్యూటర్ లో చెయ్యవచ్చు.
ఇక్కడ అందించిన website లింక్ ను ఓపెన్ చెయ్యండి.
https://voters.eci.gov.in/
ఈ లింక్ మీద క్లిక్ చేస్తే, ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది.
Sign Up లేదా Registration ప్రక్రియ
పైన, కుడి వైపున Login మీద క్లిక్ చెయ్యండి. మీకు అకౌంట్ లేక పొతే Sign Up క్లిక్ చేసి మీ Mobile ( email ఆప్షనల్ ) నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha ఇవ్వండి. Continue మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. OTP type చేసి, Password సెట్ చేసుకొని Registration ప్రాసెస్ పూర్తి చెయ్యండి.
లాగిన్
మీకు అకౌంట్ ఉన్నట్లయితే, Login మీద క్లిక్ చెయ్యండి. ఇందులో Registered Mobile no/Email ID / Epic No ఈ మూడింట్లో ఏదో ఒకటి టైపు చెయ్యండి. మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవుదాం. మొబైల్ నెంబర్ టైపు చేసి, password టైపు చేసి, Captcha ఇవ్వండి. ఇప్పుడు Request OTP మీద క్లిక్ చెయ్యండి.
Request OTP మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి Verify & Login మీద క్లిక్ చెయ్యండి.
Mobile Number ని Voter ID Card తో లింక్ చెయ్యడం
లెఫ్ట్ సైడ్ లో Forms మీద క్లిక్ చెయ్యండి. Form 8 సెలెక్ట్ చెయ్యండి. సెలెక్ట్ చెయ్యగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో Application for లో Self మరియు Other elector ఉంటుంది. Self అయితే అంటే మీ voter id కి మొబైల్ నెంబర్ లింక్ చెయ్యడానికి ఈ ఆప్షన్ ను ఎంచుకోండి. మీ కుటుంబ సభ్యులు లేదా ఇతరుల కొరకు అయితే other elector ఎంచుకోండి.
EPIC నెంబర్ ఎదురుగా ఉండే బాక్స్ లో EPIC నెంబర్ ఇవ్వండి మరియు Submit మీద క్లిక్ చెయ్యండి.
EPIC కి సంభందించిన వివరాలు చూపియ్యడం జరుగుతుంది. OK మీద క్లిక్ చెయ్యండి.
OK మీద క్లిక్ చేసిన తర్వాత, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో రెండవ ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి.
“Correction of Entries in Existing Electoral Roll”.
Select చేసిన తర్వాత OK మీదన క్లిక్ చెయ్యండి.
FORM 8 application చూపిస్తుంది.
Right సైడ్ లో Next ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చెయ్యండి.
Details కూడా Next ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చెయ్యండి.
Application for Correction of Entries in Existing Electoral Roll లో Mobile నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చెయ్యండి.
మొబైల్ నెంబర్ బాక్స్ లో మొబైల్ నెంబర్ ఇవ్వండి. Next మీద క్లిక్ చెయ్యండి.
Place అడుగుతుంది. మీ ఊరి పేరు లేదా నియోజక వర్గం పేరు ఇచ్చి Next మీద క్లిక్ చెయ్యండి.
Submission లో Captcha టైపు చేసి, Send OTP మీద క్లిక్ చెయ్యండి.
OTP వచ్చిన తర్వాత Enter OTP అనే చోట టైపు చేసి, Preview అండ్ Submit మీద క్లిక్ చెయ్యండి. Submit మీద క్లిక్ చేసి ఫారం 8 సబ్మిట్ చెయ్యండి.
EPIC Card లేదా Voter ID Download చెయ్యడం.
Form 8 సబ్మిట్ చేసిన వెంటనే, Home స్క్రీన్ లోకి వెళ్ళండి. e-Epic Download మీద క్లిక్ చెయ్యండి.
I have ఎదురుగా Epic no సెలెక్ట్ చెయ్యండి.
దిగువన EPIC Number ఇవ్వండి మరియు State సెలెక్ట్ చెయ్యండి. Search మీద క్లిక్ చెయ్యండి.
Send OTP మీద క్లిక్ చెయ్యండి. OTP వచ్చన తర్వాత, OTP enter చేసి వెరిఫై చెయ్యండి.
Verify మీద క్లిక్ చెయ్యగానే Download e-EPIC ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చెయ్యండి. మీ EPIC card download అవుంతుంది.