అందరికీ నమస్కారం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల రైతులందరూ Agri Stack ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురించి మీకు ఈ పోస్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరికి, ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఒక 11 నెంబర్లు గల సంఖ్య జనరేట్ చేయబడుతుంది. ఈ సంఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న మరియు అందించబోయే
- సబ్సిడీలు,
- లోన్లు,
- రైతు భరోసా,
- పీఎం కిసాన్
లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించ బోయే పథకాలకు అన్నిటికి ఇదే ప్రామాణికం.
మనం ఎందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రైతు కు భూములు గలవో ఆ గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారిని కలవాల్సి ఉంటుంది. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది ఎందుకంటే సాధారణంగా రైతు ఒక చోట, భూములు ఒక చోట ఉండడం లేదా రైతు పనుల నిమిత్తం వలస వెళ్లడం భూములు గల రైతు ఆధార్ వేలి ముద్రలు వేయడం ఇదంతా పెద్ద తతంగం.
రైతు ఎక్కడున్న, మీ సచివాయలం పోకుండానే మీరున్న చోటు నుండే పై ప్రక్రియంత కేవలం 10 నిమిషాలలో పూర్తి చేయవచ్చును. ఇందుకు కావలసినవి.
- ఆధార్ నెంబరు
- ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్
- అదే విధంగా అడంగల్ అనగా సర్వే నెంబరు అవసరం.
ఇప్పుడు మీరు Mobile లేదా Computer లో నేను చెప్పిన విధంగా చెయ్యండి. ఇందులో రెండు స్టెప్స్ ఉంటాయి.
- New Account Creation.
- Account create అయ్యాక Login అయ్యి రిజిస్ట్రేషన్ చెయ్యడం.
ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్, New account క్రియేషన్ లో భాగంగా https://apfr.agristack.gov.in/farmer-registry-ap/#/ ఈ లింకు browse అనగా copy and paste చెయ్యచ్చు లేదా పై link పై క్లిక్ చెయ్యండి. ఇందులో common officer మరియు common former అనే రెండు ఆప్షన్స్ మీకు కనబడతాయి.
ఇందులో మీరు common farmer select చేస్తే కింది విధంగా common create new account enable అవుతుంది. దీనిపై మీరు click చేస్తే అక్కడ ఆధార్ నెంబరు అడుగుతుంది.
ఇక్కడ రైతు ఆధార్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి. Submit చేసిన తర్వాత Registered Mobile కి OTP వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టైమ్ గడువు లోపల ఆ ఆరు అంకెల నెంబరు ను ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి. ఆప్పుడు మీకు ఇలా రైతు పేరు తండ్రి లేదా భర్త పేరు ఇంగ్లీష్ లో చూపిస్తుంది. వీటికి ఎదురుగా మీరు తెలుగు లో తండ్రి లేదా భర్త పేరు ఎంటర్ చేసి, దిగువున మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబరు ఎంటర్ చెయ్యాలి.
ఇప్పుడు ఆ నెంబరు కి OTP వస్తుంది. OTP enter చేసి Password create చేసుకోవాలి ఎందుకంటే ఒక వేళ ఫోన్ నెంబరు కానీ పోతే OTP లేకుండా కేవలం మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన అవ్వచు. ఇప్పుడు first step, New user account creation కంప్లీట్ అయ్యింది.
ఇప్పుడు రెండవ స్టెప్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్. మనం మన అకౌంట్ https://apfr.agristack.gov.in/farmer-registry-ap/#/ లాగిన్ లేదా sign in అవ్వాలి. ఇక్కడ మనం ముందు లాగా మనం common farmer select చేసి Phone నెంబరు ఎంటర్ చెయ్యాలి తరువాత OTP లేదా password option select చేసుకోవాలి. ఒకవేళ OTP సెలెక్ట్ చేస్తే, phone కి OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి, CAPTCHA ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి లేదా OTP కాకుండా పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తే మనం ముందు క్రియేట్ చేసిన Password ఎంటర్ చేసి, CAPTCHA ఎంటర్ చేసి లాగిన్ అవ్వచు. ఇందులో ఏవిధంగా నైనా గాని మనం లాగిన్ అయ్యి, లాగిన్ తరువాత రైతు చిరునామా అడుగుతుంది. అందులో మన చిరునామా అనగా ప్రస్తుతం మన ఆధార్ లో ఉన్న అడ్రస్, ఇందులో మీరు ఉన్న స్టేట్ మరియు పిన్ కోడ్ అందులో వస్తుంది మిగిలిన చిరునామా మనం తెలుగులో ఎంటర్ చెయ్యాలి తరువాత రైతు యొక్క భూముల వివరాలు జిల్లా మండలం రెవిన్యూ గ్రామం సెలెక్ట్, పై విధంగా సెలెక్ట్ చేయాలి.
అదే విధంగా ఇక్కడ మనం సర్వే నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగా ఆ సర్వే నెంబరు లో గల రైతులందరూ వస్తారు. ఇందులో మన పేరు మీద క్లిక్ చేసి సెలెక్ట్ చెయ్యాలి తరువాత వెరిఫై చెయ్యాలి అనగా ఇక్కడ ఏవైతే భూములు ఆ రైతు ఆధార్ కి లింక్ అయినాయో అవి మాత్రమే కనబడతాయి. ఇక్కడ మరొక్క విషయం ఏమిటంటే ప్రభుత్వ, డీ పట్టా , డాటెడ్ అనగా చుక్కల భూములు ప్రస్తుతానికి కనబడవు.
కనుక వెరిఫై తరువాత చివరిగా రైతు ఆధార్ కోసం సెపరేట్ ట్యాబు ఓపెన్ అవుతుంది. ఇందులో చెక్ box, tick చేసి language English select చేసి bottom లో గల ఖాళీ స్పేస్ లో ఆధార్ ఎంటర్ చెయ్యగానే మళ్ళీ ఏవిధంగా అయితే మొదట్లో మనం చేసామో అలా OTP వెళ్తుంది. ఇక్కడ ఆరు నెంబర్ల సంఖ్య ఎంటర్ చెయ్యగానే మీ రిజిస్ట్రేషన్ Successful అని ఆకు పచ్చ రంగులో మెసేజ్ కనబడుతుంది.
వెంటనే పైన డౌన్లోడ్ pdf అని ఒక ఆప్షన్ రైట్ సైడ్ టాప్ లో కనబడును. ఇది మనం డౌన్ లోడు చేసుకొని మన వివరాలు Photo, phone నెంబరు సర్వే నెంబర్ లాంటి పూర్తి వివరాలు చూసుకోవచు. ఇక్కడితో మన రెండవ step farmer registration పూర్తవుతుంది. కానీ ఇక్కడ ఒక మనకు ఒక doubt వస్తుంది మరి మన 11 నెంబర్ల ID ఎక్కడ అని ఆ విషయానికి వస్తే మనం ఈ విధంగా 2 వ స్టెప్ లో చేసిన డేటా సంబంధిత అగ్రికల్చర్, VRO మరియు మండల తహశీల్దార్ వారి పరిశీలనకు వెళ్తుంది.
వీరు పరిశీలించి అప్రూవ్ చెయ్యగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఈ విధంగా Congratulations! We are delighted to inform you that your Farmer Enrollment application has been successfully approved. Your new Farmer ID is 49545****** అని వస్తుంది.
ప్రతి ఒక్క రైతు కూడా పైన చెప్పిన సమాచారం ప్రకారం రిజిస్టర్ చేసుకోగలరు.