FREE Bus Scheme Registration in Andhra Pradesh | Super Six

FREE Bus Scheme Registration in Andhra Pradesh | Super Six

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన Super Six హామీలలో ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని ఆగష్టు 15 నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకానికి కావాల్సిన అర్హతలు మరియు రిజిస్ట్రేషన్  గురించి తెలుసుకుందాం.

ప్రారంభ తేది : 15 ఆగష్టు 2025 

అర్హతలు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళలు (వయస్సు పరిమితి లేదు)

వర్తించే బస్సులు: APSRTC పల్లె వెలుగు, Express బస్సులు 

రిజిస్ట్రేషన్ : ఆన్లైన్ పద్దతిలో మరియు కౌంటర్ లో ఆధార్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ప్రతి నెల 250 నుంచి 260 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కొరకు ఖర్చు పెడుతున్నది. ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోకపోతే కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరుగుతుంది లేదా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. 

ఈ పథకం ప్రధాన ప్రయోజనాలు

మహిళలకు,  రవాణా ఖర్చుల్లో తగ్గింపు.

ఉపాది, విద్య కోసం మహిళల ప్రస్థానానికి మద్దతు 

సామాజిక ఆర్థిక సాధికారత సాధన 

ఉచిత బస్సు పథకం రిజిస్ట్రేషన్ విధానం  

APSRTC అధికారిక వెబ్సైటు లో ఆధార్ కార్డు తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ కొరకు ఈ వెబ్సైటు లోకి వెళ్ళండి.

apsrtconline.in      

 

లేదా బస్ స్టాండ్ కౌంటర్ లలో అప్లై చేసుకోవచ్చు.

 

ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణం చేయవచ్చు  

APSRTC పల్లె వెలుగు మరియు express బస్సులు ఉచిత ప్రయాణానికి వర్తిస్తాయి.

మొదటి విడతలో జిల్లా పరిమితిలో మాత్రమే ప్రయాణం చెయ్యగలరు మరియు అంతర్జిల్లా ప్రయాణాల పై పరిమితి ఉంటుంది. 

ఉచిత బస్సు పథకానికి అర్హతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతి వయస్సు మహిళలు అర్హులు 

ఆధార్ ఆధారిత ధృవీకరనతో పథకానికి నమోదు అవసరం

వయస్సు పరిమితి లేకుండా అన్ని వర్గాల మహిళలు లబ్దిదారులుగా పరిగనించబడతారు.

ఉచిత బస్సు పథకం ప్రస్తుత స్థితి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పథకాన్ని అమలు చేయడంలో జిల్లా స్థాయిలో రెండు నెలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి.

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యా రాణి వంటి మంత్రులు పర్యవేక్షణ భాద్యతలు స్వీకరించారు.    

 

 

Leave a Comment